పాఠశాలలకు విద్యుత్ నిలిపివేత పుకార్లను ఖండించిన మంత్రిత్వ శాఖ

- July 31, 2023 , by Maagulf
పాఠశాలలకు విద్యుత్ నిలిపివేత పుకార్లను ఖండించిన మంత్రిత్వ శాఖ

కువైట్: కొన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాలు, గుడిసెలు మరియు పొలాలలో విద్యుత్తును నిలిపివేయడం గురించిన అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తుందని, వాటిల్లో వాస్తవం లేదని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రొటీన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఏటా వేసవి కాలానికి ముందు అమలు చేయబడుతుందని అందులో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలను అందించడానికి సాధ్యమయ్యే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్తు, నీటిని ఆదా చేయడం, వినియోగంలో వ్యర్థాలను తగ్గించడం, వాటిని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా దేశ వనరులను సంరక్షించడం, నిలబెట్టుకోవడం కోసం మంత్రిత్వ శాఖ అవగాహన ప్రచారాలను కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com