ఆగస్టులో ఉక్రేనియన్ శాంతి చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!

- July 31, 2023 , by Maagulf
ఆగస్టులో ఉక్రేనియన్ శాంతి చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!

జెడ్డా:  సౌదీ అరేబియా ఆగస్టు 5,  6 తేదీలలో ఉక్రేనియన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సమావేశాలకు ఇండియా, బ్రెజిల్‌తో సహా ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆహ్వానిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం తెలిపింది.  ఈ సమావేశంలో ఇండోనేషియా, ఈజిప్ట్, మెక్సికో, చిలీ,  జాంబియాతో సహా 30 దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ చర్చలు ఉక్రెయిన్‌కు అనుకూలమైన శాంతి నిబంధనలకు అంతర్జాతీయ మద్దతునిస్తాయని ఉక్రెయిన్, యూరప్ కంట్రీస్ భావిస్తున్నాయి. వీరితోపాటు బ్రిటన్, దక్షిణాఫ్రికా, పోలాండ్ ఈయూ ప్రతినిధులు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ హాజరవుతారని భావిస్తున్నారు. మే నెలలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ జెడ్డాలో అరబ్ లీగ్ సమ్మిట్‌కు హాజరైనందున సౌదీ అరేబియా చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుండి అరబ్ దేశాలు చాలా వరకు తటస్థంగా వ్యవహారిస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com