‘భగవంత్ కేసరి’లో ఆ డోస్ కాస్త ఎక్కువేనట.!
- August 01, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 19న గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఇటీవల వచ్చిన టీజర్ బాలయ్య అభిమానుల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.
ఇక త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. మాస్ మసాలా యాక్షన్ సన్నివేశాల్ని ధిట్టంగా ఈ సినిమాలో డిజైన్ చేసినట్లు శాంపిల్‌గా టీజర్‌తోనూ చూపించేశారు.
ఇక, సినిమా విషయానికి వస్తే, సినిమాలో పొలిటికల్ పంచ్‌లు గట్టిగానే పేలినట్లు తెలుస్తోంది. రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ డైలాగులు బాలయ్య నోట బాగా పలికించారట.
కామన్‌గానే బాలయ్య డైలాగుల్లో ధిట్ట. ఇక, ఇప్పుడు ఆ పంచ్ పవర్ మరింత పెరిగిందని అంటున్నారు. అసలు సిసలు మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారట ‘భగవంత్ కేసరి’లో బాలయ్య.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!