హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలేంటీ.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

- August 03, 2023 , by Maagulf
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలేంటీ.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండానే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా వింటున్నాం. ఫిట్‌నెస్‌గా వున్న కొందరు యంగ్‌స్టర్స్ కూడా అనూహ్యంగా ఆకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్యూర్‌కి గురై ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఈ మధ్య అనేకం చూస్తున్నాం. 
అయితే, హార్ట్ ఫెయిల్యూర్ అనేది సడెన్‌గా జరిగిపోతుందా.? కాదు, ముందే కొన్ని హెచ్చరికలు చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. గుండె దడ, అలసట, ఆందోళన వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తేనే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని అంటున్నారు.
శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండెను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వుంది. గుండె చుట్టూ రక్తనాళాల్లో అసవసరమైన కొవ్వు పేరుకుపోతే, రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడి గుండె పోటు వచ్చే అవకాశాలున్నాయ్.
సో, ముందుగా కొలెస్ట్రాల్ కంట్రోల్ గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతల్లో మొదటిది. అలాగే, లైఫ్ స్టైల్‌లో తీసుకునే కొన్ని జాగ్రత్తలు గుండెను ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడతాయ్. 
శరీరానికి తగినంత శ్రమ, రోజూ ఎంతో కొంత వ్యాయామం ఖచ్చితంగా డైలీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఆల్రెడీ గుండె సంబంధిత వ్యాధులేమైనా వుంటే, రెగ్యులర్‌గా వైద్యుని సంప్రదించడం, ఆహారంలో అధికంగా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం, గ్యాస్ అధికంగా నిండిన పానీయాల జోలికి పోకుండా వుండడం తదితర జాగ్రత్తలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయ్. గుండె పోటు నుంచి దూరంగా వుండేలా చేస్తాయ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com