హెన్నాతో జుట్టుకు సహజ పోషణ

- June 24, 2015 , by Maagulf
హెన్నాతో జుట్టుకు సహజ పోషణ


ప్రసుత రోజుల్లో స్త్రీ, పురుషులిరువురిలో కంబైండ్‌గా ఉన్న అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు తెల్లబడిపోవడం. కాలుష్య వాతవరణం, ప్రస్తుత జీవన విధానంలోని మార్పులూ, తీసుకునే ఆహారం ఇలా అనేక పరిస్థితులు దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అనేక రకాల హెయిర్‌ ట్రీట్‌మెంట్లు, రకరకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే అందరికీ ఈ పద్ధతులు అందుబాటులో ఉండేవి కావు. భారీ ఖర్చుతో కూడుకున్నవి. అలాంటి వారి కోసం సహజంగా మనం ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్‌ ఫాలింగ్‌ కంట్రోల్‌ ట్రీట్‌మెంట్‌ హెన్నా. హెన్నా అంటే మార్కెట్లో అనేక రకాల పౌడర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో ఎంతో కొంత కెమికల్స్‌ ఖచ్చితంగా మిక్స్‌ అయ్యే అవకాశం  ఉంది. కనుక సహజసిద్ధమైన గోరింటాకు ఆకులను పొడిగా చేసి, దానిలో ఒక నిమ్మకాయరసం పిండి, కొద్దిగా తులసీ, మందార ఆకుల పొడి కలిపి, టీ డికాక్షన్‌ నీళ్లలో మరిగించి ఆ నీటితో మొత్తం ఈ మిశ్రమాన్ని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి ముందురోజు రాత్రి నానబెట్టి ఉంచుకొని తరువాతి రోజు తలకి పట్టించి ఒక గంట తరువాత, కుంకుడుకాయ పొడి గానీ, శీకాయ పొడితో గానీ తలస్నానం చేస్తే జుట్టు అందంగా వత్తుగా పెరగడమే కాక అన్ని రకాల పోషకాలు అంది , కుదుళ్ల నుండీ వెంట్రుకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అంతే కాక తెల్లని వెంట్రుకలకు మంచి రంగు కూడా అందుతుంది. జుట్టుకి పోషణ తగ్గినప్పుడు పొడిబారి, కాంతి విహీనంగా మారిపోతుంది. ఇలాంటప్పుడు ఈ హెన్నా ప్యాక్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com