హెన్నాతో జుట్టుకు సహజ పోషణ
- June 24, 2015
ప్రసుత రోజుల్లో స్త్రీ, పురుషులిరువురిలో కంబైండ్‌గా ఉన్న అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు తెల్లబడిపోవడం. కాలుష్య వాతవరణం, ప్రస్తుత జీవన విధానంలోని మార్పులూ, తీసుకునే ఆహారం ఇలా అనేక పరిస్థితులు దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్లు, రకరకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే అందరికీ ఈ పద్ధతులు అందుబాటులో ఉండేవి కావు. భారీ ఖర్చుతో కూడుకున్నవి. అలాంటి వారి కోసం సహజంగా మనం ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ట్రీట్మెంట్ హెన్నా. హెన్నా అంటే మార్కెట్లో అనేక రకాల పౌడర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో ఎంతో కొంత కెమికల్స్ ఖచ్చితంగా మిక్స్ అయ్యే అవకాశం ఉంది. కనుక సహజసిద్ధమైన గోరింటాకు ఆకులను పొడిగా చేసి, దానిలో ఒక నిమ్మకాయరసం పిండి, కొద్దిగా తులసీ, మందార ఆకుల పొడి కలిపి, టీ డికాక్షన్ నీళ్లలో మరిగించి ఆ నీటితో మొత్తం ఈ మిశ్రమాన్ని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి ముందురోజు రాత్రి నానబెట్టి ఉంచుకొని తరువాతి రోజు తలకి పట్టించి ఒక గంట తరువాత, కుంకుడుకాయ పొడి గానీ, శీకాయ పొడితో గానీ తలస్నానం చేస్తే జుట్టు అందంగా వత్తుగా పెరగడమే కాక అన్ని రకాల పోషకాలు అంది , కుదుళ్ల నుండీ వెంట్రుకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అంతే కాక తెల్లని వెంట్రుకలకు మంచి రంగు కూడా అందుతుంది. జుట్టుకి పోషణ తగ్గినప్పుడు పొడిబారి, కాంతి విహీనంగా మారిపోతుంది. ఇలాంటప్పుడు ఈ హెన్నా ప్యాక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







