మధురైలో రైలు ప్రమాదం...10 మంది సజీవ దహనం

- August 26, 2023 , by Maagulf
మధురైలో రైలు ప్రమాదం...10 మంది సజీవ దహనం

తమిళనాడు: మధురైలో స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు కోచ్‌ లో మంటలు చెలరేగి‍ పది మంది మరణించగా మరో 20 మందికి గాయాలయ్యాయి. లఖ్‌నవూ నుంచి రామేశ్వరం వెళ్తున్న ప్రత్యేక రైలులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. రైలు నాగర్‌కోయిల్ జంక్షన్‌ నుంచి మదురైకి చేరుకోగా కోచ్‌ని వేరు చేసి మదురై స్టాబ్లింగ్ లైన్‌లో ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యేక రైలు కోచ్‌లోని ప్రయాణికులు గ్యాస్ సిలిండర్‌ను అక్రమంగా తమతో తీసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.

టీ చేసే సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు అనుమానిస్తున్నారు. మంటలను గమనించిన చాలా మంది ప్రయాణికులు కోచ్‌ నుంచి బయటకు వచ్చారు. కొంత మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. IRCTC పోర్టల్‌ని ఉపయోగించి ఎవరైనా పార్టీ కోచ్‌ని బుక్ చేసుకోవచ్చని... కానీ గ్యాస్ సిలిండర్ వంటి మండే పదార్థాలను తీసుకెళ్లడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. కోచ్‌ను రవాణా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com