స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు...15 మంది అరెస్ట్
- August 27, 2023
మస్కట్: దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ 46,000 కంటే ఎక్కువ నిషేధించబడిన సిగరెట్ల బాక్సుల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. నిందితులు వాటిని సముద్రం మీదుగా స్మగ్లింగ్ చేసి రెండు ట్రక్కుల్లో ఎక్కిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. మరో కేసులో, విలాయత్ ఆఫ్ బౌషర్‌లోని మిస్ఫా ప్రాంతంలోని అనేక ప్రదేశాల నుండి ఎలక్ట్రిక్ కేబుల్స్ మరియు వైర్లను దొంగిలించిన ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఆసియా జాతీయతకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది. వీటితోపాటు ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లో 8 మందిని అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని కోస్ట్ గార్డ్ పోలీసులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆసియా జాతీయులకు చెందిన 8 మంది చొరబాటుదారులతో కూడిన పడవను స్వాధీనం చేసుకున్నారని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







