గ్లోబల్ లాజిస్టికల్ హబ్‌గా సౌదీ:క్రౌన్ ప్రిన్స్

- August 28, 2023 , by Maagulf
గ్లోబల్ లాజిస్టికల్ హబ్‌గా సౌదీ:క్రౌన్ ప్రిన్స్

జెడ్డా: సౌదీ అరేబియాను గ్లోబల్ లాజిస్టికల్ హబ్‌గా మార్చేందుకు లాజిస్టిక్స్ కేంద్రాల కోసం మాస్టర్ ప్లాన్‌ను రవాణా, లాజిస్టిక్స్ కోసం సుప్రీం కమిటీ చైర్మన్ అయిన క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ కింగ్డమ్ యొక్క లాజిస్టికల్ సెక్టార్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం, ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా.. గ్లోబల్ లాజిస్టికల్ హబ్‌గా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. జాతీయ రవాణా, లాజిస్టిక్స్ వ్యూహం (NTLS) ద్వారా ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా లాజిస్టికల్ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు స్థానికంగా, ప్రాంతీయంగా పెంచే లక్ష్యంతో నిర్దేశించబడిన ప్యాకేజీలో ఈ ప్రణాళిక భాగమని క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాన్ని పెంచడం, తద్వారా ఉద్యోగాలను సృష్టించే అవకాశాన్ని మెరుగుపరడం, సౌదీ అరేబియాను మూడు ముఖ్యమైన ఖండాలలో(ఆసియా, యూరప్, ఆఫ్రికా) దాని భౌగోళిక స్థానాన్ని బట్టి ప్రపంచ లాజిస్టికల్ హబ్‌గా మార్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. లాజిస్టిక్స్ కేంద్రాల కోసం మాస్టర్ ప్లాన్ మొత్తం 100 మిలియన్ చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంతో 59 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రియాద్ ప్రాంతంలో 12, మక్కా ప్రాంతంలో 12; తూర్పు ప్రావిన్స్‌లో 17, మిగిలిన రాజ్యంలో 18 చొప్పున రానున్నాయి. ప్రస్తుతం 21 కేంద్రాలు వివిధ దశలలో ఉండగా..  2030 నాటికి అన్ని కేంద్రాలు పూర్తవుతాయని క్రౌన్ ప్రిన్స్ వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com