సుకుమార్‌తో రామ్ చరణ్ ఇంకోస్సారి.! ఎప్పుడంటే.!
- August 29, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ ఏ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వస్తే గిస్తే ఈ సినిమాలో నటనకు గాను రామ్ చరణ్‌కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చి వుండాల్సింది.. అన్న అభిప్రాయాలూ లేకపోలేదు ఇటీవల జాతీయ అవార్డుల విడుదల సందర్భంగా ఈ అభిప్రాయాలు అక్కడక్కడా వినిపిస్తున్నాయ్.
అసలు విషయమేంటంటే, ఈ సూపర్ హిట్ కాంబో ఇంకోసారి రిపీట్ కానుందట. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
అలాగే, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తూనే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన ప్రాజెక్ట్ పైనా ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది చివరల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధంగా వుంది.
ఇక, సుకుమార్‌తోనూ రామ్ చరణ్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడట. ఆ సినిమాని వచ్చే ఏడాది చివర్లో పట్టాల మీదకు తీసుకెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయనీ ఇన్సైడ్ సమాచారం.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







