‘సెప్టెంబర్’ కోసం ఇంధన ధరలను ప్రకటించిన ఖతార్ ఎనర్జీ

- September 01, 2023 , by Maagulf
‘సెప్టెంబర్’ కోసం ఇంధన ధరలను ప్రకటించిన ఖతార్ ఎనర్జీ

దోహా: ఖతార్ ఎనర్జీ ఈరోజు సెప్టెంబర్ 2023 నెల ఇంధన ధరలను ప్రకటించింది.తాజా అప్‌డేట్ ప్రకారం: ఆగస్టుతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు QR 1.90 కాగా, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర QR2.10 వద్ద స్థిరంగా ఉంది.  డీజిల్ ధర లీటరుకు QR2.05 గా ఉంది.

గత కొన్ని నెలలుగా డీజిల్, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ప్రీమియం పెట్రోల్ ధరలు లీటరుకు QR 2.05 -QR 1.90 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇంధనం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మార్కెట్‌కు ఇంధన ధరలను నిర్ణయించడం ప్రారంభించి సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరల జాబితాను ఖతార్ ఎనర్జీ ప్రకటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com