యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకున్న 'ఖుషి' మూవీ టీమ్
- September 03, 2023
తెలంగాణ: టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఖుషి మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - మా ఖుషి సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్ చెబుతున్నాం. మా సినిమా ఘన విజయం దక్కిన నేపథ్యంలో మా మూవీ టీమ్ అంతా కలిసి సకుటుంబంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చాం. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత దేవాలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాం. యాదాద్రి నిర్మాణాలు, ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. అన్నారు. ఖుషి దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







