రియాద్ లో హై క్వాలిటీ గ్రీన్ స్పేస్

- May 19, 2016 , by Maagulf
రియాద్ లో హై క్వాలిటీ గ్రీన్ స్పేస్

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు హై క్వాలిటీ గ్రీన్ స్పేస్ అండ్ రిక్రియేషన్ని ఏర్పాటు చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బండార్ చెప్పారు. సోమవారం 10 ఎన్విరాన్మెంటల్ అండ్ రిక్రియేషనల్ ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. ఈ కొత్త ప్రాజెక్టులు సుమారు 150,000 చదరపు మీటర్ల స్థలాన్ని సౌదీ రాజధానిలోని పలు డిస్ట్రిక్ట్స్లో కవర్ చేసేలా తీర్చిదిద్దబడ్డాయి. సౌదీ అరేబియాలో నివసిస్తున్న పైరులు, అలాగే వలసదారులకు ఆహ్లాదాన్నిచ్చేలా, వారు హాయిగా జీవించేలా తగినన్ని సౌకర్యాలు కల్పించేందుకు సౌదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు. అరియాద్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్లో 100 మున్సిపల్ పార్కుల్ని సిటీ వ్యాప్తంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవల కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రిన్స్ బండార్ ప్రారంభించిన ఐకానిక్ కింగ్ సల్మాన్ పార్క్కి ఇవి అదనం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com