హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్ (సీపీఆర్) శిక్షణ

- September 13, 2023 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్ (సీపీఆర్) శిక్షణ

హైదరాబాద్: కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) శిక్షణ ఒక జీవితాన్ని కాపాడుతుంది. ఎయిర్పోర్టులో హడావుడి మధ్య ఊహించని సమయంలో ప్రాణాంతక ఘటన చోటు చేసుకుంటే సిపిఆర్ శిక్షణ పొందిన వ్యక్తులు అవసరమైన వారికి సహాయపడగలరు. జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జిహెచ్ఐఎఎల్) తన సిబ్బంది మరియు విమానాశ్రయ కమ్యూనిటీ కోసం అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ సిపిఆర్ శిక్షణను మంగళవారం నిర్వహించింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ హెడ్ అండ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ ఇమ్రాన్ సుభాన్, 20 మంది డాక్టర్ల బృందంతో పాటు జిహెచ్ ఐఎఎల్ సిఇఒ శ్రీ ప్రదీప్ పంసికర్ మరియు జిహెచ్ ఐఎఎల్ సిఒఒ శ్రీ అరుణ్ బెహల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిఎంఆర్ ఎరీనాలో సుమారు 450 మంది పాల్గొనే ఈ శిక్షణ పెరుగుతున్న జీవనశైలి సంబంధిత గుండె జబ్బులకు ప్రతిస్పందనగా ఒక కీలకమైన దశ, ఇది గుండె ఆగిపోయిన రోగికి వైద్య సహాయం వచ్చే వరకు మొదటి స్థాయి చికిత్సను ఇవ్వడం ద్వారా ఉద్యోగులు వేగంగా మరియు సమర్థవంతంగా ప్రతిస్పందించగలుగుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com