ఒమన్‌లో ప్రమాదం.. వాహన డ్రైవర్‌ మృతి

- September 14, 2023 , by Maagulf
ఒమన్‌లో ప్రమాదం.. వాహన డ్రైవర్‌ మృతి

మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని బిడ్‌బిడ్‌లోని విలాయత్‌లో మట్టి లోడ్ తో వెళుతున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఇదే సమయంలో వెనుకు వస్తున్న వాహనంపై మట్టి లోడ్ పడటంతో వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బిడ్‌బిడ్‌లోని విలాయత్‌లోని మస్కట్-నిజ్వా రోడ్‌లో మట్టితో నిండిన ట్రక్కు కుప్పకూలడంతో ప్రమాదం జరిగిందని పేర్కొంది.  ఆ మట్టి లోడ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనంపై పడిందని, ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడని వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం కలిగిందని, దయచేసి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ROP ఒక ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com