భిక్షాటన ముఠాగుట్టును బట్టబయలు చేసిన ఖతార్ అధికారులు

- September 15, 2023 , by Maagulf
భిక్షాటన ముఠాగుట్టును బట్టబయలు చేసిన ఖతార్ అధికారులు

దోహా: మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ దాడులు ఉధృతం చేసింది. భిక్షాటన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అరెస్టు చేసింది. సదరు ముఠాలో ఉన్నవారు ఆసియా దేశానికి చెందిన వారని అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో భిక్షాటన చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయడం కనిపించింది. వారి నుంచి నగదు, పాస్‌పోర్టులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. "మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా స్వప్రయోజనాల కోసం యాచించడం కోసం ప్రజలను దోపిడీ చేయడంలో పాల్గొన్న ఒక ఆసియా దేశానికి చెందిన వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పట్టుబడిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com