6.2 మిలియన్ దిర్హాంల విలువైన నిషేధిత పదార్థాలు సీజ్

- September 18, 2023 , by Maagulf
6.2 మిలియన్ దిర్హాంల విలువైన నిషేధిత పదార్థాలు సీజ్

యూఏఈ: ఎయిర్ కార్గో ద్వారా భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని దుబాయ్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అడ్డుకున్నది. ఈ సందర్భంగా 200,000 నిరోధిత మాదక ద్రవ్యాలు, సుమారు Dh6.2 మిలియన్ల విలువైన మాత్రల అక్రమ రవాణాను విజయవంతంగా నిరోధించారు. ఆసియాలోని ఓ దేశం నుండి వచ్చిన రెండు షిప్‌మెంట్‌లపై అనుమానం రావడంతో దుబాయ్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లోని ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధకారులు తెలిపారు. వారి తనిఖీలో 20 పొట్లాలు, 460 కిలోల బరువున్న నియంత్రిత ఫార్మాస్యూటికల్స్‌తో కూడిన మొదటి షిప్‌మెంట్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నది. దాదాపు 1 మిలియన్ దిర్హామ్ మార్కెట్ విలువ ఉంటుందని తెలిపారు. 22 పొట్లాలను కలిగి ఉన్న రెండవ షిప్‌మెంట్‌లో 520కిలోల ట్రామాడోల్ ను గుర్తించారు. మొత్తం 175,300 నిషేధిత టాబ్లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారుగా 5.25 మిలియన్ దిర్హామ్‌లుగా అంచనా వేశారు. ప్రోటోకాల్‌లను అనుసరించి దుబాయ్ పోలీస్ యొక్క జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్‌కు అప్పగించినట్లు దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ మహబూబ్ ముసాబిహ్ వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com