ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేరళకు 200kg లగేజీ పరిమితి, Dh440 టిక్కెట్ ధర..!

- September 18, 2023 , by Maagulf
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేరళకు 200kg లగేజీ పరిమితి, Dh440 టిక్కెట్ ధర..!

యూఏఈ: యూఏఈ, దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ మధ్య ప్రయాణీకుల షిప్ సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది భారతీయ ప్రవాసులకు సౌకర్యవంతమైన .. తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ విధానాన్ని అందిస్తుంది. దాదాపు Dh442 టిక్కెట్‌ల ధర ఉండే అవకాశం ఉన్నది.  ఈ సర్వీస్ భారతీయ ప్రవాసులు కేరళకు దాదాపు మూడు రోజుల్లో చేరుకోవచ్చని ఇండియన్ అసోసియేషన్ షార్జా ప్రెసిడెంట్ వైఏ రహీమ్ తెలిపారు. “డిసెంబర్‌లో పాఠశాల విరామానికి ముందు సేవను ప్రారంభించడం, అమలు చేయాలనే ఆలోచన ఉంది. యూఏఈలోని భారతీయ ప్రవాసులు అధిక ఎయిర్‌లైన్ ఛార్జీలు చెల్లించకుండా వారి స్వస్థలానికి వెళ్లేలా మేము ప్రణాళికలు రూపొందించాం.’’ అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కేరళ ప్రభుత్వ ప్రతినిధులు సెప్టెంబర్ 24న భారత కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తారని తెలిపారు. దీంతో తాము నవంబర్ నాటికి సర్వీస్ ట్రయల్ రన్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com