సౌదీలో ఎనర్జీ డ్రింక్స్ సేఫ్..!
- September 18, 2023
జెడ్డా: విశ్వసనీయ అంతర్జాతీయ ఏజెన్సీలు చేసిన పరిశోధనల ప్రకారం..ఎనర్జీ డ్రింక్స్ మరియు కార్బోనేటేడ్ సాఫ్ట్ ఫిజీ డ్రింక్స్‌లో ఉపయోగించే అన్ని పదార్థాలు సురక్షితమైనవిగా గుర్తించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ధృవీకరించింది. ఎనర్జీ డ్రింక్స్ లేదా ఫిజీ డ్రింక్స్ వల్ల కలిగే హానిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కువ వినియోగం మరియు పోషక విలువలు తగ్గడం వల్ల కలుగుతుందని ఆరోగ్యానికి హానికరం జరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెప్పింది. రుచి కోసం చక్కెర ద్రావణం, రంగు పదార్థాలు మరియు కార్బన్ డయాక్సైడ్‌తో సంతృప్తపరచబడిన ఫిజీ డ్రింక్స్‌ను తయారు చేస్తారని తెలిపింది. అయితే కార్బోనేట్ పానీయాలు కరిగిన కార్బన్ డయాక్సైడ్‌తో కూడిన నీరు అని SFDA వెల్లడించింది. కార్బోనేటేడ్ నీటిలో ఫ్లాట్ వాటర్ కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. వినియోగదారులు బబ్లీ అనుభూతిని ఆస్వాదించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సాధారణంగా తీపి పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల నష్టం వాటిల్లవచ్చని, ఎందుకంటే వాటిలో చక్కెర అధికంగా ఉంటుందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్‌లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్‌లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ