నయన తారే కావాలంటున్నారట.!

- September 19, 2023 , by Maagulf
నయన తారే కావాలంటున్నారట.!

సౌత్ క్వీన్ ఇప్పుడు నార్త్‌లో హవా చూపిస్తోంది. ఇటీవల ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది నయన తార. తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవ్వడం.. షారూఖ్ ఖాన్, నయనతార జంటకి మంచి క్రేజ్ రావడం.. ఇవన్నీ సౌత్ క్వీన్‌ని నార్త్‌కి దగ్గర చేసేశాయ్.

దాంతో, వరుస అవకాశాలు నయనతారకు క్యూ కట్టేస్తున్నాయట. ఈ క్రమంలో సౌత్‌ నుంచి కొన్ని అవకాశాలు వదులుకుంటోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్త మవుతున్నాయ్. 

ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో నయన తార ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిందన్న సమాచారం అయితే వుంది. అలాగే, మరో స్టార్ హీరో కూడా నయనతారే హీరోయిన్‌గా కావాలంటున్నాడట. 

ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న నయన తార, అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేసిందట. దాంతో, ఆ సినిమా రూపొందించే నిర్మాణ సంస్థ కాస్త తటపటాయిస్తోందట. 

కానీ, ఆ హీరో మాత్రం నయన తారే తన హీరోయిన్.. అని గట్టిగా పట్టు పట్టి కూర్చున్నాడట. అసలే స్టార్ హీరో.. ఆ పై ప్రెస్జీజియస్ ప్రాజెక్ట్.. చేసేదేం లేక సదరు నిర్మాణ సంస్థ డైలమాలో పడిందట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.? ఏంటా కథ.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com