కువైట్ లో 'వియ్ స్టేండ్ విత్ సిబిఎన్' కార్యక్రమం

- September 23, 2023 , by Maagulf
కువైట్ లో  \'వియ్ స్టేండ్ విత్ సిబిఎన్\' కార్యక్రమం

కువైట్ సిటీ: ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యంలో "వియ్ స్టేండ్ విత్ సిబిఎన్" అనే కార్యక్రమాన్ని ఫర్వానియా లో ఉన్న ద్వైహి ప్యాలస్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ, చంద్రబాబు గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా సి.ఐ.డి అరెస్టు చేసి గత 12 రోజులుగా రిమాండ్ పేరిట రాజమండ్రి జైల్లో ఉంచి జగన్ ప్రభుత్వం తీర్చుకుంటున్న కక్షపూరిత చర్యలను ముక్తకంటంతో ఖండించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలిసి పనిచేసి సైకో పాలనకు చమరగీతం పాడాలని అన్నారు. చంద్రబాబు దేశంలోనే ఎలాంటి మచ్చలేని నాయకుడని, ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలాగా బయటకు రావాని అందరు ఆకాంక్షించారు. వియ్ స్టేండ్ విత్ సిబిఎన్,  సైకో పోవాలి - సైకిల్ రావాలి, జగన్ పోవాలి - పాలన మారాలి, ఐ యాం విత్ సిబిఎన్ అనే నినాదాలతో హోరెత్తించారు. 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, నాగేంద్రబాబు అక్కిలి, ఈశ్వర్ నాయుడు మద్దిన, బాలకృష్ణ, షేక్ బాషా, దుగ్గి శ్రీనివాస్, కొల్లి ఆంజనేయులు, వంశీ, నరేష్, శివ, చిన్నబాబు గున్న, విసి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గాజులపల్లి, బాలరెడ్డయ్య, గూదే శంకర్, రమేష్, సుబ్బ రాజుదొడ్డి పల్లి ,కోడూరి మహేష్ గౌడ్, విజయ్ కుమార్ పసుపులేటి, బొమ్ము నరసింహులు రషీదా, తదితరులు మరియు జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, కోనసీమ రాజేష్. దండు వేణు, శేఖర్, బిరడా సూర్యనారాయణ, ఇమ్మిడిశెట్టి సూర్యనారాయణ, ఓబులేసు, మర్రి రెడ్డయ్య, ధరణి నాగ రాయల్ తదితరులు, కువైట్ మహాసేన నాయకులు రాపాక రాజేష్, రామకృష్ణ తదితరులు, పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, జన సైనికులకు ప్రతిఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com