150వ సినిమా లో చిరుతో కలిసి చిందేయ్యనున్న కాథరిన్
- May 21, 2016
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా చేస్తున్నానని ప్రకటించిన దగ్గర నుంచి రోజుకో వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సందడి చేస్తోంది. ఈ సినియాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార లేదా అనుష్క నటించనున్నారే వార్త అప్పట్లో హల్ చల్ చేసింది.
అయితే ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఖరారు కాకపోయినప్పటికీ, ఐటం సాంగ్‌లో ఆడిపాడేందుకు మరో కుర్ర హీరోయిన్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. సరైనోడు సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ థెరిస్సా, మెగాస్టార్ 150వ సినిమాలో ఐటం సాంగ్ చేయనుందట.
అంతేకాదు ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుందని సమాచారం. కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మెగాస్టార్ సరసన ఐటం సాంగ్‌లో నటించే అవకాశం కొట్టేయడం కేథరిన్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు.
150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఖరారయిన తర్వాత హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ వస్తుంది. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు.
చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' స్థాపించారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









