రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్.. 32 దేశాల నుండి 1,800 ప్రచురణ సంస్థలు

- September 29, 2023 , by Maagulf
రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్.. 32 దేశాల నుండి 1,800 ప్రచురణ సంస్థలు

రియాద్: కింగ్ సౌద్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గురువారం ప్రారంభమైన రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల నుండి 1,800 కంటే ఎక్కువ ప్రచురణ సంస్థలు తమ తాజా ప్రచురణలను ప్రదర్శిస్తున్నాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌదీ సాహిత్యం, ప్రచురణ మరియు అనువాద కమీషన్ నిర్వహించిన ‘స్పూర్తిదాయకమైన గమ్యస్థానం’ అనే నినాదంతో 10 రోజులపాటు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. "రియాద్ రీడ్స్ ఫ్రెంచ్" చొరవలో భాగంగా 70 ఫ్రెంచ్ పబ్లిషింగ్ హౌస్‌లు భాగస్వామ్యం అయ్యాయి. ఇందులో అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, కళాఖండాల ప్రత్యేక ప్రదర్శన, 25 కంటే ఎక్కువ కళాత్మక పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 7 వరకు జరగనున్న ఈ ఫెయిర్‌లో పది లక్షల మందికి పైగా పుస్తక అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 200కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com