'శభాష్‌ నాయుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

- May 21, 2016 , by Maagulf
'శభాష్‌ నాయుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

ఓటు వేయడం కోసం 'శభాష్‌ నాయుడు' షూటింగ్‌ను వాయిదా వేసిన విశ్వనటుడు కమల్‌హాసన్... ఇకపై శరవేగంగా చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకు యూనిట్‌ మొత్తాన్ని సంసిద్ధం చేసేందుకు విడుదల తేదీ ఖరారు చేసేసినట్టు తెలుస్తోంది. వీలైనంత తక్కువ సమయంలో 'శభాష్‌ నాయుడు' షూటింగ్‌ పూర్తి చేసేలా కమల్‌ ప్రణాళిక సిద్ధం చేశారట. మలయాళ సీనియర్‌ దర్శకుడు టీకే రాజీవ్‌పిళ్లై దర్శకత్వంలో త్రిభాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 1 విడుదల చేయాలని కమల్‌ భావి స్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తుండగా, కీలకమైన పాత్రలో శ్రుతిహాసన నటిస్తోంది. 'దశావతారం'లోని బలరామ్‌ నాయుడు పాత్రకు కొనసాగింపుగా కామెడీ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో 'శభాష్‌ నాయుడు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్నారు. అమెరికాలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com