'శభాష్ నాయుడు' రిలీజ్ డేట్ ఫిక్స్
- May 21, 2016
ఓటు వేయడం కోసం 'శభాష్ నాయుడు' షూటింగ్‌ను వాయిదా వేసిన విశ్వనటుడు కమల్‌హాసన్... ఇకపై శరవేగంగా చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకు యూనిట్ మొత్తాన్ని సంసిద్ధం చేసేందుకు విడుదల తేదీ ఖరారు చేసేసినట్టు తెలుస్తోంది. వీలైనంత తక్కువ సమయంలో 'శభాష్ నాయుడు' షూటింగ్ పూర్తి చేసేలా కమల్ ప్రణాళిక సిద్ధం చేశారట. మలయాళ సీనియర్ దర్శకుడు టీకే రాజీవ్‌పిళ్లై దర్శకత్వంలో త్రిభాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1 విడుదల చేయాలని కమల్ భావి స్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తుండగా, కీలకమైన పాత్రలో శ్రుతిహాసన నటిస్తోంది. 'దశావతారం'లోని బలరామ్ నాయుడు పాత్రకు కొనసాగింపుగా కామెడీ థ్రిల్లర్ సబ్జెక్టుతో 'శభాష్ నాయుడు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్నారు. అమెరికాలో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపనున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









