జర్మనీలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఒమానీ టెంటు

- June 26, 2015 , by Maagulf
జర్మనీలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఒమానీ టెంటు

జర్మనీలోని కియెల్ పట్టణంలో జరుగుతున్న కియెల్ సెయిలింగ్ వీక్ లో, ఒమాన్ సెయిల్ ప్రోజెక్టు వారిచే ఏర్పాటుచేయబడిన టెంటు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.  జూన్ 20 నుండి 28 వరకు జరుగనున్న ఈ సెయిలింగ్ వీక్ లో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన విలాయత్ ఆఫ్ నిజ్వా ఇంకా నీయాబత్ ఆఫ్ జబాల్ అల్ అక్‌ధర్ యొక్క నమూనాలు, రోజ్ వాటర్ , మృణ్మయ పాత్రలు మరియు వెండి ఆభరణాల తయారీ వంటివాటిని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక్కడి అధికారులు నౌకా నిర్మాణానికి ప్రసిద్ధమైన విలాయత్ ఆఫ్ సూర్, ఇంకా మస్కట్ సిటీ, అల్ శర్కీయా డ్యూన్స్, మత్రాః సౌక్, అల్ దెమానియత్ దీవులు, మస్కట్లోని రాయల్ ఒపేరా హౌస్ వంటి వివిధ పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలను, ముద్రణలను సందర్శకులకు అందజేస్తున్నారు.

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com