జర్మనీలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఒమానీ టెంటు
- June 26, 2015
జర్మనీలోని కియెల్ పట్టణంలో జరుగుతున్న కియెల్ సెయిలింగ్ వీక్ లో, ఒమాన్ సెయిల్ ప్రోజెక్టు వారిచే ఏర్పాటుచేయబడిన టెంటు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జూన్ 20 నుండి 28 వరకు జరుగనున్న ఈ సెయిలింగ్ వీక్ లో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన విలాయత్ ఆఫ్ నిజ్వా ఇంకా నీయాబత్ ఆఫ్ జబాల్ అల్ అక్ధర్ యొక్క నమూనాలు, రోజ్ వాటర్ , మృణ్మయ పాత్రలు మరియు వెండి ఆభరణాల తయారీ వంటివాటిని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక్కడి అధికారులు నౌకా నిర్మాణానికి ప్రసిద్ధమైన విలాయత్ ఆఫ్ సూర్, ఇంకా మస్కట్ సిటీ, అల్ శర్కీయా డ్యూన్స్, మత్రాః సౌక్, అల్ దెమానియత్ దీవులు, మస్కట్‌లోని రాయల్ ఒపేరా హౌస్ వంటి వివిధ పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలను, ముద్రణలను సందర్శకులకు అందజేస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









