‘కాంతితో క్రాంతి’లో నిన‌దించిన తెదేపా శ్రేణులు

- October 08, 2023 , by Maagulf
‘కాంతితో క్రాంతి’లో నిన‌దించిన తెదేపా శ్రేణులు

అమరావతి: అక్రమ అరెస్టుతో జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత చంద్ర‌బాబుకు సంఘీభావంగా ఢిల్లీలో నిర్వ‌హించిన కాంతితో క్రాంతి కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైకాపా స‌ర్కారు తీరుపై నిర‌స‌న తెలిపారు. సేవ్ ఏపి… సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ నిరసన కార్య‌క్ర‌మానికి వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని శనివారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పాల్గొన్నారు. భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com