దోహా మెట్రో సర్వీస్ పనిగంటలు పొడిగింపు
- November 06, 2023
దోహా: AFC ఛాంపియన్స్ లీగ్ 2023 కోసం దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సర్వీసులు తమ మెట్రో సర్వీస్‌ను తెల్లవారుజామున 2 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. క్రిస్టియానో రొనాల్డో, అల్-నాసర్‌లోని అతని సహచరులు ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో AFC ఛాంపియన్స్ లీగ్ కోసం మంగళవారం( నవంబర్ 7)న అల్ దుహైల్‌తో తలపడతారు. ఈ మ్యాచ్‌కు స్థానిక, జిసిసి అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. ఆ రోజున ఊహించిన ప్రేక్షకులకు అనుగుణంగా మెట్రో రన్నింగ్ సమయాలను సడలించారు. మెట్రోలింక్ M311 రోజు స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్‌కు బదులుగా అల్ సూడాన్ బస్ స్టేషన్‌కు/నుండి నడుస్తుందని పేర్కొంది. స్పోర్ట్ సిటీ, అల్ వాబ్ సర్వీస్ ఏరియాలు స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్‌కు బదులుగా అల్ వాబ్ క్యూఎల్ఎమ్ మెట్రో స్టేషన్ ద్వారా సేవలు అందించబడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







