ఇజ్రాయెల్ దాడుల్లో 10,000 దాటిన మృతులు
- November 07, 2023
యూఏఈ: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 10,000 దాటిందని గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 10,022 మంది మరణించినట్లు గాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రే ప్రకటించారు. యుద్ధం మొదలై నెల రోజులు దగ్గర పడుతుంది. అక్టోబరు 7న హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మంది చనిపోగా.. ఇజ్రాయోల్ ప్రతీకార దాడుల్లో 10 వేలకుపైగా పాలస్తీయన్లు మరణించారు. హమాస్ కిడ్నాప్ చేసిన 240 మందికి పైగా బందీలను విడిపించే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







