జూన్ మూడో వారంలో సినిమా 'జీరో' విడుదల..
- May 25, 2016
శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'జీరో'. రొమాంటిక్ థ్రిల్లర్ గా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ ను సాధించింది. గ్యాంబ్లర్, సెవెన్త్ సెన్స్ చిత్రాల్లో నటించిన అశ్విన్, శివేద జంటగా నటించారు. శివ్ మోహ(అరుణ్ కుమార్) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎక్కడా టచ్ చేయని డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్ హైలైట్ గా నిలుస్తాయి. క్వాలిటీకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గంట పాటు కథలో భాగంగా వచ్చే గ్రాఫిక్స్ ఆడియెన్స్ ను ఎంతో థ్రిల్ కు గురి చేస్తాయి. ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి, తులసి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ మొదటివారంలో ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసి, జూన్ మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ అధినేత తెలియజేశారు.
ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: బాబుకుమార్, ఎడిటింగ్: సుదర్శన్, నిర్మాణం: శ్రీ చక్ర ఇన్నోవేషన్స్, దర్శకత్వం: శివ్ మోహా(అరుణ్ కుమార్).
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









