గాజాలోని పాలస్తీనియన్లకు ఖతార్ మరింత సహాయం

- November 22, 2023 , by Maagulf
గాజాలోని పాలస్తీనియన్లకు ఖతార్ మరింత సహాయం

దోహా: రెండు ఖతార్ సాయుధ దళాల విమానాలు ఆహారం,  నివాస సామాగ్రితో సహా 93 టన్నుల సహాయాన్ని తీసుకుని ఈజిప్టులోని అల్ అరిష్ నగరానికి బయలుదేరాయి. ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్ (QFFD), ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) లు వీటిని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 13 విమానాలు గాజాకు మొత్తం 492 టన్నుల సహాయాన్ని అందించాయి. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా క్లిష్ట మానవతా పరిస్థితుల మధ్య సోదర పాలస్తీనా ప్రజలకు ఖతార్ రాష్ట్రం పూర్తి మద్దతులో ఈ సహాయం భాగమని ఖతార్ అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com