జూన్ 6న బాబు బంగారం పాటలు విడుదల
- May 26, 2016
భలే భలే మగాడివోయ్' హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో 'బాబు బంగారం' పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫస్ట్‌లుక్‌కి అంతటా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ రెస్పాన్స్‌తో రెట్టించిన ఉత్సాహం తెచ్చుకుని 'బాబు బంగారం' టీమ్ జూలై 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా జూన్ 2న టీజర్‌ను విడుదల చేస్తారట. ఇక జూన్ 6న గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో విడుదలయ్యే అవకాశం వుంది. వెంకీ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను సితార క్రియేషన్స్‌తో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









