గల్ఫ్ వలసజీవులకు శుభవార్త చెప్పిన కేటీఆర్..!
- November 26, 2023
తెలంగాణ: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలో గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో రోడ్‌షో నిర్వహించారు. రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
ప్రధానంగా గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరే రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు సైతం బీమా అందిస్తామని తెలిపారు. గల్ఫ్ బీమా పథకం కింద రూ.5లక్షల బీమా కవరేజ్ ప్రతి ఒక్కరికి అందుతుందని తెలిపారు. దీంతోపాటు గల్ఫ్ పాలసీలో భాగంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా కలిపి సమగ్రమైన పాలసీని అమలులోకి తీసుకువస్తామని వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి