సమంత వెబ్ సిరీస్ ఆగిపోయిందా.? కారణమిదేనా.?

- December 06, 2023 , by Maagulf
సమంత వెబ్ సిరీస్ ఆగిపోయిందా.? కారణమిదేనా.?

ఓటీటీలో సమంత చేసిన ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ అప్పట్లో ఓ సంచలనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత నుంచి వచ్చిన సినిమాలన్నీ యావరేజ్ హిట్స్‌గా నిలిచాయ్.
ఆ తర్వాత సమంత తన మయోసైటిస్ వ్యాధి గురించి బయట పెట్టడం.. అదో సంచలనంగా మారడం.. ఆ కారణంగానే తాను సినిమాలకు తాత్కాలికంగా దూరమవుతున్నానని ప్రకటించడం అన్నీ జరిగిపోయాయ్.
అయితే, ఆ ప్రకటన తర్వాత కూడా ‘ఖుషి’ సినిమా వచ్చింది సమంత నుంచి. అంతకు ముందే సమంత పూర్తి చేసిన వెబ్ సిరీస్ ఒకటి ఇంతవరకూ పెండింగ్ వుండిపోయింది.
అదే ‘సిటాడెల్’. అమెజాన్ ప్రైమ్‌ కోసం ప్రెస్టీజియస్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కింది. ఈ సిరీస్‌ షూటింగ్ సమంత ఎప్పుడో పూర్తి చేసింది. యాక్షన్ గాళ్‌గా ఈ సిరీస్‌ కోసం సమంత మేకోవర్ అయ్యింది కూడా. అయితే, ఆ సిరీస్ జాడే లేదింతవరకూ.
ఈ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ ఎప్పుడో స్ర్టీమింగ్ అయ్యింది. అందులో ప్రియాంకా చోప్రా లీడ్ రోల్ పోషించింది. ఈ సిరిస్‌ని తెలుగులో డబ్ చేసి వదిలారు కూడా. అయితే, దానికి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో, సమంత సిరీస్‌ని లైట్ తీసుకున్నారట.. మధ్యలోనే ఈ సిరీస్ ఆపేశారట.. అందుకే ఇంతవరకూ ఏ అప్డేట్ లేదని సరికొత్త ప్రచారం తెర పైకి వచ్చింది.
నిజంగానే సమంత ‘సిటాడెల్’ సిరీస్ ఆగిపోయిందా.? ఏమో.! సమంత నుంచి కానీ, మేకర్ల నుంచి కానీ కన్‌ఫామేషన్ రావల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com