రాజస్థాన్ ముఖ్యమంత్రి పై తొలగని సందిగ్ధం.. ఢిల్లీకి వసుంధర రాజే
- December 07, 2023
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 5 రోజులు కావస్తోంది. బిజెపి ఘన విజయం సాధించిన 3 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. అయితే ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. మాజీ సీఎం వసుంధర రాజేతోపాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ఆ పార్టీ ఎంపీలు బాబా బాలక్‌నాథ్, దియా కుమారి కూడా సీఎం పదవిని ఆశిస్తుండడం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఎడతెగని అనిశ్చితి కొనసాగుతున్న వేళ మాజీ సీఎం వసుంధర రాజే బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరోసారి సీఎం పదవిని ఆశిస్తున్న ఆమె అధిష్ఠానంతో గురువారం ఉదయం చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ఆమె అపాయింట్మెంట్ కోరారని, గురువారం ఉదయం చర్చించనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సోమ, మంగళవారాల్లో రాజస్థాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన 60 మందికి పైగా బిజెపి ఎమ్మెల్యేలతో వసుంధర రాజే సమావేశమయ్యారు. మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నప్పటికీ వసుంధర రాజేకు ఎమ్మెల్యేలు మద్ధతు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. కాగా వసుంధర రాజే 2003 -2008 బిజెపి జాతీయాధ్యక్షురాలిగా, 2013 -2018 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఇటీవలే వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి విజయ దుందుభి మోగింది. మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరగగా బిజెపి 163, కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!