బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.?
- December 11, 2023
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. చివరిగా హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి వున్నారు. ఆఖరి వారం నామినేషన్లలో భాగంగా శోభా శెట్టిని ఎలిమినేట్ చేశారు.
శోభా వెళుతూ వెళుతూ కప్పు తీసుకుని రావాలిరా.! అంటూ అమరదీప్‌కి చెప్పింది. నా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ అర్జున్‌కి చెప్పింది.
కానీ, శివాజీనే కప్పు గెలుచుకునేది అంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్నుంచీ బిగ్‌బాస్ విన్నర్ శివాజీనే అనే స్పష్టత వున్నప్పటికీ, అనూహ్యంగా అమరదీప్ పోటీకి వచ్చాడు.
బుల్లితెర నటుడిగా అమరదీప్‌కి మంచి ఫాలోయింగ్ వుంది. బుల్లితెర సెలబ్రిటీలంతా కూడా అమరదీప్కే సపోర్ట్ చేస్తున్నారు. సో, బిగ్‌బాస్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అమరదీప్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
మొదట డల్‌గా సాగిన అమరదీప్ ప్రయాణం.. చివరికి చేరేసరికి జోరందుకుంది. హౌస్‌లో ఆఖరి కెప్టెన్ అనిపించుకున్నాడు. టాస్కుల్లోనూ హుషారుగా పాల్గొంటున్నాడు. అప్పుడప్పుడూ ఫౌల్స్ ఆడినా, జనానికి కావల్సిన స్టఫ్ అందిస్తున్నాడు.
సో, అమరదీప్, శివాజీ మధ్య గట్టి పోటీ నెలకొని వుండొచ్చని అంటున్నారు. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ ఉల్టా ఫుల్టా.. సో, చివరి నిమిషంలో ఏదైనా కావచ్చు. కప్పు ఎవరిని వరించునో చెప్పలేం.! లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ జస్ట్ వన్ వీక్.!
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!