బహ్రెయిన్ లో పులకించిన ఆధ్యాత్మికత

- June 27, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో పులకించిన  ఆధ్యాత్మికత

ఈ నెల 27 వ తేదీ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యం లో తెలుగు వారు 'భక్తీ సమ్మేళనం' నిర్వహించారు. 
ఈ కార్యక్రమము లో తెలుగు వారు వందలాది మంది పాల్గున్నరు. ఈ కార్యక్రమము ఆద్యంతం భక్తుల గానామృతం తో . వక్తుల ప్రవచనాలు తో సాగింది శ్రీ వరదరాజ చార్యులు మాట్లాడుతూ తన అమూల్య సందేశాన్ని ఇచ్చారు .. ఎల్లప్పుడూ భగవంతుడుని ధ్యానించాలి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెల్లాలి . ప్రతి ఒక్కరు భగవన్నామ స్మరణ చెస్తూ ఉంటే మానసిక శాంతి కలుగుతుంది తెలుగు వారు అంతా కలసి ఈ కార్యక్రమము చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఈ కార్య క్రమాన్ని ముందుండి నడిపించిన అటువంటి హరిబాబు గారి ని ప్రశంసించారు. అలాగే శ్రీమతి వకుల  దేవి గారు గంగ సాయన్న గారు సౌమ్య గారు శ్రీరాం గారు అన్నమయ్య కీర్తనలు తో భక్తీ పారవశ్యం లో ముంచి వెత్తారు. తరువాత అంతా కలసి మహాప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్య క్రమము లో శ్రామిక బంధు శివకుమార్ గారు ... మరియు కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు. మా గల్ఫ్ ప్రతినిధి వాసుదేవ రావు గారు
తో శివకుమార్ గారు హరిబాబు గారు మాట్లాడుతూ ఈలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకొని ఆధ్యాత్మిక భావనులు తో ముందుకు వెళ్ళాలని అన్నారు జీవితం లో చివరకు  మిగిలేది భక్తిభావం మాత్రమే దీనిని అందరు గుర్తు పెట్టుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.ఈ కార్యక్రమము ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. 

 

--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com