మంచు మనోజ్ - నాని కాంబో.! ఇది విన్నారా.?

- December 13, 2023 , by Maagulf
మంచు మనోజ్ - నాని కాంబో.! ఇది విన్నారా.?

అదేంటీ.! మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలే చేయడం లేదుగా.! నానితో కలిసి సినిమా చేస్తున్నాడా.? అని ఆశ్చర్యపోతున్నారా.? ఆగండాగండి.! ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది సినిమా కోసం కాదండోయ్. ఓ టాక్ షో కోసం.

బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ షో టెలికాస్ట్ అవుతున్నట్లే.. మంచు మనోజ్ హోస్ట్‌గా ఓ టాక్ షో స్టార్ట్ కానుంది.

అదే ‘ఉస్తాద్ ర్యాప్ ఆడిద్దాం’. ఇదో సెలబ్రిటీ టాక్ షో. ఈ టాక్ షోలో సెలబ్రిటీలు ఓ అభిమాని కోసం గేమ్ ఆడతారు. అలా గేమ్ విన్ అయితే, 50 లక్షలు ప్రైజ్ మనీ పొందుతారు. అలా పొందిన ప్రైజ్ మనీ మొత్తాన్నీ ఆ అభిమానికే ఇచ్చేస్తారు.

అలా ఈ టాక్ షో ఫస్ట్ సెలబ్రిటీగా నాని హాజరయ్యారు. అసలే ‘హాయ్ నాన్న’ హిట్ కొట్టి మంచి హుషారు మీదున్నాడు నాని.  మంచు మనోజ్‌తో కలిసి, ఈ టాక్ షోలో నాని చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఈటీవీ విన్ అనే ఓటీటీ చానెల్‌లో మాత్రమే ఈ టాక్ షో రన్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com