హారర్ సినిమాలపై శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు.!
- December 13, 2023
ఒకప్పుడు హారర్ సినిమాలంటే గుండెల్లో గుబులు పుట్టేది. ఒక్కో హారర్ సీన్ వెంటాడేసేది. కానీ, ఇప్పుడు హారర్ మూవీస్‌కి అర్ధం మారిపోయింది. హారర్‌కి కామెడీ, బీభత్సమైన రొమాన్స్ జోడించి సరికొత్త క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్లు.
దాంతో, పిల్లా పెద్దా ఇష్టపడి ఈ జోనర్ మూవీస్‌ని తిలకిస్తున్నారు. అయితే, గతంలో మాదిరి అసలు సిసలు హారర్ సినిమాని చూపిస్తానంటున్నాడు హీరో శ్రీరామ్. ‘ఒకరికి ఒకరు’ సినిమాతో అప్పుడెప్పుడో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ హీరో, ఆ తర్వాత తమిళ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు.
ఆయన నటించిన తాజా చిత్రమే ‘పిండం’. సాయి కిరణ్ దైదా దర్శకుడు. 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది.
ధియేటర్లలో ‘పిండం’ సినిమా చూసి సరికొత్త థ్రిల్ ఫీలవుతారు.. అని శ్రీరామ్ చెబుతున్నాడు. అయితే, ఈ మధ్య హారర్ సినిమాలకు అర్ధం మారిపోయింది. హారర్ అంటే ఖచ్చితంగా భయంగొలిపేలానే వుండాలి. అంతేకానీ, అందులో అనవసరమైన రొమాన్స్, కామెడీని బలవంతంగా ఇరికిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ జోనర్‌ని కలుషితం చేసినట్లే.. అని శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
ఈ శుక్రవారం అనగా డిశంబర్ 15న ‘పిండం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ప్రమోషన్లు గట్టిగా చేశారీ సినిమాకి. చూడాలి మరి, ఈ హారర్ మూవీ ఎంత మేర ప్రేక్షకుల్ని భయపెడుతుందో.!
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!