పాయల్ రాజ్‌పుత్ ఆ విషయంలో సో గ్రేట్.!

- December 14, 2023 , by Maagulf
పాయల్ రాజ్‌పుత్ ఆ విషయంలో సో గ్రేట్.!

ఆ సినిమాలో నాకూ ఓ ఛాన్సివ్వండి.! అంటూ అందాల భామ పాయల్ రాజ్‌పుత్ బతిమలాడుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా.? అంటున్నారా.? ప్రపంచం దృష్టిని ఆకర్షించి, చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట పండించి, పెద్ద సినిమాగా అవతరించిన ‘కాంతార’.

ఈ సినిమా సెకండ్ పార్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే, లేటెస్ట్‌గా సినిమా యూనిట్ కాస్టింగ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ అనౌన్స్ చేసింది.

ఆ ఆడిషన్స్‌లో తనకీ అవకాశం కల్పించమంటూ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఓ రిక్వెస్ట్ పంపింది. పాయల్ రాజ్‌పుత్ ఏమీ కొత్త హీరోయిన్ కాదు. ఆల్రెడీ ‘ఆర్ ఎక్స్ 100’ వంటి ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. అలాంటిది జస్ట్ ఆడిషన్స్ కోసం తనకీ ఛాన్స్ కావాలని కోరింది. సోషల్ మీడియాలో పాయల్ రిక్వెస్ట్ చూసిన వారంతా ఆమెని అభినందిస్తున్నారు.

ఎందుకంటే ఓ మోస్తరు సెలబ్రిటీలెవరూ ఇలాంటి రిక్వెస్టులు పెట్టడానికి సహజంగా ఇష్టపడరు. అలాంటిది పాయల్ రాజ్‌పుత్ ఇలా చేసిందేంటబ్బా.! అని కొందరు వాపోతుంటే, నటిగా ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ ఇంకొందరు శభాష్ అని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com