‘సైంధవ్’ స్టోరీ అదేనా.?

- December 14, 2023 , by Maagulf
‘సైంధవ్’ స్టోరీ అదేనా.?

విక్టరీ వెంకటేష్ నటిస్తున్నతాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ సినిమా సిరీస్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.

కాగా, ఈ సినిమాకి సంబంధించి కథ ఇదేనంటూ ఓ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రీ కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట.
అరుదైన వ్యాధితో బాధపడే కూతురు, అదే తరహా వ్యాధితో బాధపడే విలన్.. కూతురుని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం, అదే సమయంలో తనను తాను కాపాడుకోవడానికి విలన్ చేసే యత్నాలు.. ఇద్దరికీ ఒకటే అవసరం.!

ఈ తరహా నేపథ్యంలోనే ‘సైంధవ్’ స్టోరీ వుండబోతోందనీ ప్రచారం జరుగుతోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరోకీ, విలన్‌కీ మధ్య సాగే పోరాటం తెరపై అత్యద్భుతంగా సృస్టించాడట శైలేష్ కొలను.

యాక్షన్ ఘట్టాల ప్రధానంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే వుంటుందట. అలాగే హృద్యమైన సెంటిమెంట్ వెంటాడుతుందట. ఇటీవల తండ్రీ కూతురి నేపథ్యంలో వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్ కూడా విక్టరీ కొడతాడేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com