పెద్దవారిలో ఫ్లూ ప్రమాదాన్ని 60% తగ్గిస్తున్న వ్యాక్సిన్లు
- December 16, 2023
దోహా: దోహా సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్‌లు పెద్దవారిలో 60% , పిల్లలలో 75% వరకు ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలవని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవగాహన ప్రచారంలో భాగంగా ఫ్లూ నుండి రక్షించడానికి ఇది ఉత్తమమైన పద్ధతి కాబట్టి టీకాలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. "తీవ్రమైన ఫ్లూ సమస్యలు, మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఫ్లూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి." అని మంత్రిత్వ శాఖ ఎక్స్(ట్విటర్) ప్లాట్‌ఫారమ్‌లో తెలిపింది. ఫ్లూ వైరస్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఆసుపత్రిలో చేరడానికి మరియు మరణానికి కూడా దారి తీస్తుంది. 2022లో ఖతార్‌లో ఫ్లూ కారణంగా 760 మందికి పైగా ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. కొవిడ్-19 నుండి రక్షించే వ్యాక్సిన్‌లు ఖతార్‌లోని అనేక ఆరోగ్య సౌకర్యాలలో ఉచితంగా లభిస్తాయని MoPH హెల్త్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ సోహా అల్ బైట్ తెలిపారు. ఫ్లూ వ్యాక్సిన్‌లు హమద్ మెడికల్ కార్పొరేషన్‌లోని ఔట్ పేషెంట్ క్లినిక్‌లతో పాటు 31 ఆరోగ్య కేంద్రాలు, ఖతార్‌లోని అనేక సెమీ-గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు మరియు క్లినిక్‌లతో సహా 90 ఆరోగ్య సౌకర్యాలలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. “సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) మరియు COVID-19 వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ల నుండి ప్రజలు సంవత్సరంలో ఈ సమయంలో అనారోగ్యానికి గురికావడం సర్వసాధారణం. ఎవరైనా ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురయితే, ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలకు ఇది చాలా ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది.” అని HMCలోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ అబ్దులతీఫ్ అల్ ఖల్ చెప్పారు. "సీజనల్ ఇన్ఫ్లుఎంజా ఒక వైరస్. బ్యాక్టీరియా కాదు. యాంటీబయాటిక్స్ వాడొద్దు. ఫ్లూ వ్యాక్సిన్ మాత్రమే దీనికి సరైన పరిష్కారం.”అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!