జూన్ 3న శ్రీశ్రీ...
- May 28, 2016
తెలుగు తెరపై ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ. తెరపై ఆయన కనిపించనప్పటికీ, మహేష్ రూపంలో అభిమానులు ఆయన్ను తెరపై చూసుకుంటున్నారు. అయితే చాలా కాలం తర్వాత కృష్ణ మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నారు. ముప్పులనేని శివ డైరెక్ట్ చేసిన శ్రీశ్రీ అనే సినిమాలో ఆయన కీలకపాత్ర పోషించారు. రివెంజ్ నెవర్ గెట్స్ ఓల్డ్ అనేది ట్యాగ్ లైన్. సినిమా పూర్తై చాలా కాలమే అయినా, రిలీజ్ కావడానికి మాత్రం లేట్ అయింది. లేటెస్ట్ గా జూన్ 3న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాడు శ్రీశ్రీ. మామూలు ఆడియన్స్ కంటే కూడా, కృష్ణ అభిమానులకు ఇది చాలా స్పెషల్ సినిమా అని చెప్పాలి. సినిమా ఎలా ఉంటుందో అన్నది పక్కన పెట్టి, తమ అభిమాన సూపర్ స్టార్ ను తెరపై చూడాలనుకుంటున్నారు అభిమానులు. నిజానికి కృష్ణ అభిమానులతో పాటు మహేష్ అభిమానులు కూడా సినిమా చూస్తే మాత్రం శ్రీశ్రీ మూవీ లాభాల బాట పట్టడం ఖాయం. ఓవర్సీస్ ఆడియన్స్ మూవీ చూడటానికి వీలుగా, సినిమాను ఆన్ లైన్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. మరి సూపర్ స్టార్ ఈ ఏజ్ లో తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









