వచ్చే నెలలో టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

- May 28, 2016 , by Maagulf
వచ్చే నెలలో టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

'వూపిరి'..'బాహుబలి' చిత్రాలతో భారీ విజయాలందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా 'అభినేత్రి'గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ త్రిభాషా చిత్రంతో తొలిసారి ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అభినే'త్రీ'కి బాగా కలిసిరావచ్చని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.ప్రభుదేవా కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. టైటిల్‌కు బాగా కనెక్ట్‌ అయిపోయారేమో గానీ దానికి తగ్గట్టే ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారట చిత్ర దర్శకుడు. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు కాగా తాజాగా సంగీత దర్శకులను కూడా భాషకు ఒకరు చొప్పున ముగ్గురితో పనిచేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా కార్యక్రమాలు పూర్తయ్యాయని సమాచారం.వచ్చే నెలలో టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ని ప్లాన్‌ చేసిన దర్శక నిర్మాతలు ఈ చిత్రంతో మిల్కీ బ్యూటీ అందాలతో అలరించే ప్రయత్నం చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com