దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు..
- May 28, 2016
కాపులకు రిజర్వేషన్ల లక్ష్యంగా రోడ్డెక్కిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి క్రమంగా మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతరాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన, ఉదయం నుంచి రాజకీయ పార్టీల నేతలతో ఎడతెగని మంతనాలు జరిపారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపి చిరంజీవి, మాజీ కేంద్రమంద్రి దాసరి నారాయణరావులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీని నేతల వద్ద ముద్రగడ ప్రస్తావించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి, చిరంజీవిలు.. ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేతలు కోరారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









