తిరిగొచ్చిన బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్
- December 25, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్ తిరిగి వచ్చింది. బుదయ్య బొటానికల్ గార్డెన్లో తాజా పండ్లు, కూరగాయలు, చేతివృత్తుల చేతిపనులు మరియు నోరూరించే ఇంట్లో తయారుచేసిన ఫుడ్ ఐటమ్స్ సందర్శకులను ఆకర్షించనున్నాయి. ఈ మార్కెట్ కేవలం షాపింగ్ కోసమే కాకుండా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు ఒక శక్తివంతమైన కేంద్రంగా గుర్తింపు పొందింది. సందర్శకులు స్థానిక రైతులు, చేతివృత్తుల వారితో కనెక్ట్ అవ్వడం, వారి ఉత్పత్తుల వెనుక ఉన్న కథల గురించి తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడం వల్ల ఆహార రవాణా వల్ల పర్యావరణ ప్రభావం తగ్గడమే కాకుండా సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల మనుగడకు కూడా భరోసాగా నిలువనున్నది. బహ్రెయిన్ మరియు పొరుగున ఉన్న సౌదీ అరేబియా నుండి సందర్శకులు తరలి వస్తున్నారని వాలంటీర్ సీరియస్ మొహమ్మద్ బేకర్ షకీబ్ తెలిపారు. మార్కెట్ ప్రతి శనివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చే మార్చి వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!