యూఏఈలో నిర్లక్ష్యపు డ్రైవర్లకు వెరైటీ పనిష్మెంట్
- December 26, 2023
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవర్లకు ప్రత్యేకమైన న్యాయస్థానం వెరైటీ పనిష్మెంట్ విధించింది. ఇటీవలి తీర్పులో అల్ ఐన్‌లోని ట్రాఫిక్ కోర్టు ముగ్గురు డ్రైవర్లకు ఒక్కొక్కరికి 50,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది. వారి లైసెన్స్‌లను మూడు నెలలపాటు రద్దు చేసింది. వారి వాహనాలను జప్తు చేసింది. దీంతోపాటు వారు విన్యాసాలు చేసిన వీధులను కూడా శుభ్రం చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పబ్లిక్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా చుట్టుపక్కల వారి భద్రతకు ముప్పుగా మారింది. దీంతో అధికారులు స్పందించి డ్రైవర్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వీధులను శుభ్రపరిచే రూపంలో రాక్లెస్ డ్రైవర్లకు సమాజ సేవ చేయవలసిందిగా కోర్టు శిక్ష విధించింది. దీనికి సంబంధించి న్యాయనిపుణులు స్పందించారు. కమ్యూనిటీ సేవ అనేది నిందితులలో మార్పును, బాధ్యతను పెంచుతుందని, జరిగిన నష్టాన్ని వారు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని లీగల్ కన్సల్టెన్సీలో లీగల్ కన్సల్టెంట్ అయిన హసన్ ఎల్హైస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!