యూఏఈలో నిర్లక్ష్యపు డ్రైవర్లకు వెరైటీ పనిష్మెంట్

- December 26, 2023 , by Maagulf
యూఏఈలో నిర్లక్ష్యపు డ్రైవర్లకు వెరైటీ పనిష్మెంట్

యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవర్‌లకు ప్రత్యేకమైన న్యాయస్థానం వెరైటీ పనిష్మెంట్ విధించింది. ఇటీవలి తీర్పులో అల్ ఐన్‌లోని ట్రాఫిక్ కోర్టు ముగ్గురు డ్రైవర్లకు ఒక్కొక్కరికి 50,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది.  వారి లైసెన్స్‌లను మూడు నెలలపాటు రద్దు చేసింది. వారి వాహనాలను జప్తు చేసింది. దీంతోపాటు వారు విన్యాసాలు చేసిన వీధులను కూడా శుభ్రం చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పబ్లిక్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా చుట్టుపక్కల వారి భద్రతకు ముప్పుగా మారింది.  దీంతో అధికారులు స్పందించి డ్రైవర్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వీధులను శుభ్రపరిచే రూపంలో రాక్లెస్ డ్రైవర్లకు సమాజ సేవ చేయవలసిందిగా కోర్టు శిక్ష విధించింది. దీనికి సంబంధించి న్యాయనిపుణులు స్పందించారు.  కమ్యూనిటీ సేవ అనేది నిందితులలో మార్పును, బాధ్యతను పెంచుతుందని, జరిగిన నష్టాన్ని వారు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని లీగల్ కన్సల్టెన్సీలో లీగల్ కన్సల్టెంట్ అయిన హసన్ ఎల్హైస్ అభిప్రాయపడ్డారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com