హజ్-2024: విదేశీ యాత్రికుల నమోదు ప్రారంభం

- December 26, 2023 , by Maagulf
హజ్-2024: విదేశీ యాత్రికుల నమోదు ప్రారంభం

జెడ్డా: హజ్ 2024 కోసం విదేశీ యాత్రికుల అధికారిక నమోదును ప్రారంభించినట్లు సౌదీ అరేబియా సోమవారం ప్రకటించింది. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం యాత్రికులు ఇప్పుడు హజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నుసుక్ హజ్ అప్లికేషన్ ద్వారా హజ్ 1445/2024 కోసం తమ కుటుంబాలతో సహా నమోదు చేసుకోవచ్చు.” అని మినిస్ట్రీ ఆఫ్ మీడియా ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ (CIC) వెల్లడించింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు ఓషియానియా ఖండాల నుండి యాత్రికులు నుసుక్ హజ్ అప్లికేషన్ ద్వారా తీర్థయాత్ర కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ గురించిన మరిన్ని వివరాలను hajj.nusuk.sa వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

మహమ్మారి అనంతర కాలంలో 2023లో మొదటి పూర్తి సామర్థ్యం గల హజ్ తీర్థయాత్రను నిర్వహించారు. 1,660,915 మంది విదేశీ యాత్రికులు, 184,130 మంది స్వదేశీ యాత్రికులు సహా మొత్తం 1,845,045 మంది యాత్రికులు గత హజ్ చేశారు. వారిలో మేల్ యాత్రికుల సంఖ్య 969,694 కాగా, మహిళా యాత్రికుల సంఖ్య 875,351. ఆసియా దేశాల నుండి మొత్తం 1,056,317 మంది(63.5 శాతం) యాత్రికులు వచ్చారు. అరబ్ దేశాల నుండి వచ్చిన యాత్రికుల సంఖ్య 346,214 గా ఉంది. మొత్తం యాత్రికులలో వీరిది 21 శాతం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com